ఏపీలో మొదలైన సమగ్ర భూ సర్వే

ఏపీలో మొదలైన సమగ్ర భూ సర్వే
ఏపీలో భూముల రీ సర్వే మొదలైంది. ‘ వైఎస్సార్- జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు దగ్గర సర్వే రాయి పాతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్వే కోసం వినియోగించే పరికరాలను జగన్  పరిశీలించారు. భూముల రీ సర్వే వివరాలు, ఫలితాలను అధికారులు సీఎంకు వివరించారు. 2023 నాటికి మూడు దశల్లో సర్వే పూర్తి చేయనుంది.  రాష్ట్ర వ్యాప్తంగా 1.26 లక్షల చదరపు కి.మీ సర్వే చేయనున్నారు. మొత్తం 16 వేల మంది సర్వేయర్లు  సర్వేలో పనిచేయనున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ , ఉన్నతాధికారులు హాజరయ్యారు. జగన్ బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేసిన రోజా