న్యూఢిల్లీ: లిబరలైజ్డ్రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద అన్ని లావాదేవీలను నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ (ఎస్‌బిఎమ్) ఇండియాను కొన్ని రోజుల కిందట ఆర్బీఐ ఆదేశించడంతో అనేక భారతీయ ఫిన్‌టెక్‌లు ఇబ్బందిపడుతున్నాయి. రెమిటెన్స్సేవలు అందించే నియో బ్యాంకింగ్ ఫిన్‌టెక్‌లు నియో, జోల్వ్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఆర్బీఐ ఆదేశాల ఎఫెక్ట్ ఎక్కువగానే ఉందని ఇండ్‌మనీ, వెస్టెడ్ ఫైనాన్స్ వంటి యూఎస్- స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లు, ఇండస్ట్రీ లీడర్లు చెప్పారు. నియో తన ఫారెక్స్ కార్డ్ అంతర్జాతీయ లావాదేవీలను తాత్కాలికంగా ఆపివేసింది.
ఎస్బీఎం ఇండియా ఎల్‌ఆర్‌ఎస్ లావాదేవీని నిలిపివేయడంతో కనీసం ఏడు లేదా ఎనిమిది ఫిన్‌టెక్‌ల వ్యాపారం ప్రభావితమయింది. ఎస్బీఎం ఇండియాకు కనీసం 35 ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలతో భాగస్వామ్యం ఉంది. ఇది భారతదేశంలో చెల్లింపుల కోసం బుక్‌మై ఫారెక్స్, ఇన్‌స్టారెమ్, హాప్రెమిట్ వంటి వాటితో కూడా పని చేస్తుంది. 2004లో ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్ ప్రకారం భారతదేశంలోని వ్యక్తి ప్రతి ఆర్థిక సంవత్సరానికి 2,50,000 డాలర్ల వరకు వరకు పంపుకోవడానికి అనుమతి ఉంటుంది. ఆర్బీఐ నిర్ణయం వల్ల ఎస్బీఎం ఇండియా కస్టమర్లు తమ డెబిట్‌కార్డులను వాడుకోవడం సాధ్యం కావడం లేదు.
