అధిక వడ్డీ పేరుతో 20 కోట్లు మోసం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అధిక వడ్డీ ఆశ చూపి రూ.20 కోట్లు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై సోమవారం ఎస్పీ గైక్వాడ్  వైభవ్  రఘునాథ్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. తెలకపల్లి మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన చోటమియా(జహీర్) నడిగడ్డ, తూడుకుర్తి తదితర ప్రాంతాల్లోని 6 రూపాయల వడ్డీ ఇస్తానని చెప్పి నగలు, నగదు, ధాన్యం తీసుకొని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.20 కోట్ల వరకు ఉంటుందని బాధితులు తెలిపారు.

వారం రోజుల కింద నాగర్ కర్నూల్  పోలీస్ స్టేషన్​కు చోటే మియా వెళ్లి బాధితులకు డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈనెల 5న వచ్చి కలుస్తానని చెప్పగా, సోమవారం బాధితులు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. చోటే మియా రాకపోవడంతో ఎస్పీ ఆఫీస్  ముందు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.