టీఎస్ ఈఈయూ 327 ఆవిర్భావ దినోత్సవం

సంగారెడ్డి టౌన్, వెలుగు: విద్యుత్ కార్మికులు,ఆర్టీజీఎన్​లు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు, ఈపీఎఫ్, జీపీఎఫ్​సమస్య సాధన కోసం ఐఎన్ టీయూసీ 327 యూనియన్ పని చేస్తుందని కంపెనీ సెక్రటరీ భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలోని జిల్లా యూనియన్ ఆఫీసు ఎదుట జెండా ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1954లో సంజీవరెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్​కు అనుబంధంగా యూనియన్ ఏర్పడి నేడు దేశవ్యాప్తంగా 5,452యూనిట్లకు ప్రాతినిధ్యం వహిస్తోందని పేర్కొన్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించామని వెల్లడించారు. జెండా ఆవిష్కరణలో యూనియన్ నాయకులు గోవిందరావు, మంజుల, జిల్లా అధ్యక్షుడు వీరయ్య, సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, కోశాధికారి వెంకటేశం, ఈశ్వరప్ప, ఉద్యోగులు పాల్గొన్నారు.