శంషాబాద్ లో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

శంషాబాద్ మున్సిపాల్టీ పరిధిలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శత జయంతి వేడుకలు జరిగాయి.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి పలమకుల జంగయ్య  బస్టాండ్ వద్ద గల అంబేథ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించిన  సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అనంతరం టపాసులు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. 

Also Read :- బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ  రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ యాదగిరి శంషాబాద్ మండల కార్యదర్శి నర్రగిరి నందిగామ మండల కార్యదర్శి గడ్డం జంగయ్య ఏఐటీయూసీ మండల కార్యదర్శి గిలకరాజు.. సీపీఐ సీనియర్ నాయకులు బాలయ్య నరేష్ నాయక్ కార్మికులు సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు