సీఎం జగన్ పైకి రాయి క్యాట్ బాల్ తో కాదు చేత్తోనే విసిరారు... కమిషనర్

శనివారం విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్రంలో పెను దుమారం రేపుతోంది. ఈ ఘటన అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. ఈ దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తుండగా ఇది వైసీపీ ఆడుతున్న డ్రామా అని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ కమిషనర్ కాంతిరానా కీలక వ్యాఖ్యలు చేసారు. సోమవారం ఐజితో కలిసి ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన ఆయన ఆ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

ALSO READ : జగన్ మీద రాళ్ల దాడిపై పవన్ సంచలన కామెంట్స్..

సీఎం జగన్ పైకి రాయి క్యాట్ బాల్ తో విసరాలేదని, బలమైన వ్యక్తి చేత్తోనే బలంగా విసిరారని అన్నారు. రోడ్ షో సమయంలో కరెంట్ కోటాపై వస్తున్న విమర్శల పట్ల స్పందించిన ఆయన అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కాదని, ప్రోటోకాల్ లో భాగంగానే చేశామని అన్నారు. సీఎం పదే పదే బస్సు పైకి ఎక్కుతున్న కారణంగా కరెంటు తీగలు తగిలే ప్రమాదం ఉందని భావించి పవర్ కట్ చేశామని స్పష్టం చేశారు.