కొత్త సంవత్సరం సందర్భంగా జాతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రజలకు చిన్నపాటి గిఫ్ట్‌ను అందించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.102.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా ధర తగ్గింపుతో ఇవాళ్టి నుంచి ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1998.50కు అందనుంది.
Commercial LPG cylinder prices slashed by Rs 102.50
— ANI Digital (@ani_digital) January 1, 2022
Read @ANI Story | https://t.co/Ua7xgO4seJ#LPG pic.twitter.com/WCOt9bZM20
కాగా, సెప్టెంబర్ 1న 75, అక్టోబర్ 1న రూ.43, నవంబర్ 1న రూ.266, డిసెంబర్ 1న రూ.100 చొప్పున 19 కిలోల సిలిండర్‌పై ధర పెంచాయి కంపెనీలు. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,101కు పెరిగింది. అయితే 2012లో ఇక్కడ కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ.2,200 ఉండేది. ప్రస్తుతం ధర తగ్గింపుతో ఈ నిర్ణయంతో రెస్టార్టెంట్లు, హోటళ్లు, టీ స్టాళ్లు నడిపే వారికి కొంత భారం తగ్గనుంది. అయితే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్, 5, 10 కిలోల సిలిండర్ల ధరలో మాత్రం ఏ మార్పు లేదు.
