Crime Thriller Review: కారులో డెడ్‌బాడీ.. ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో నిండిన క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌.. కథేంటంటే?

తమిళంలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్‌‌బస్టర్ హిట్‌‌ కొట్టిన సినిమా 'స‌ట్టం ఎన్ కైయిల్' (Sattam En Kaiyil). ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో దూసుకెళ్తోంది. శాఖాహారి. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ అడుగడుగున ట్విస్టులతో ఆడియన్స్ కి థ్రిల్ ఇస్తోంది.

దీపావళి కానుకగా సెప్టెంబర్ 27న థియేటర్స్కి వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాకుండా 2024లో రిలీజైన కోలీవుడ్ బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ లోనిలిచింది. ఐఎండీబీలో 9.3 రేటింగ్ సొంతం చేసుకున్న మూవీగా గుర్తింపు పొందింది. వివరాల్లోకి వెళితే.. 

త‌మిళ్ స్టార్ క‌మెడియ‌న్ స‌తీష్ హీరోగా న‌టించిన మూవీ 'స‌ట్టం ఎన్ కైయిల్'. చాచి డైరెక్ట్ చేసిన ఈ మూవీ రివెంజ్ థ్రిల్ల‌ర్ పాయింట్‌ తో తెరకెక్కి థియేటర్స్ లో మంచి హిట్ కొట్టింది. క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ మూవీస్లో బెస్ట్ థ్రిల్లర్గా నిలిచేలా.. డైరెక్టర్ చాచి ఈ మూవీని తెరకెక్కించారు. కాగా ఇపుడీ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 

కథేంటంటే::

తన తల్లి తండ్రులను కలవడం కోసం గౌతమ్ (సతీష్) చీకటిలో ఒక వ్యక్తిని సడెన్గా గుద్దేస్తాడు. దాంతో అతని కారును ఢీకొన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు. ఇక ఆ వ్యక్తి డెడ్‌బాడీని ట్రంక్‌లో దాచిపెడతాడు. ఇక ఎవ్వరులేని ప్రదేశం చూసి సీక్రెట్‌గా పూడ్చేయాల‌ని గౌత‌మ్ ప్లాన్ చేస్తాడు. కానీ ఒక పోలీసు పట్టుకుంటాడు.

ఒక చెక్ పోస్ట్ దగ్గర గౌతమ్ కారు చెక్ చేస్తోండ‌గా...అక్కడున్న ఏఎస్ఐ భాషాను (పావెల్ న‌వ‌గీతం) కావాల‌నే గౌత‌మ్ కొడ‌తాడు. కారులో ఉన్న ఆ డెడ్‌బాడీ పోలీసుల కంటికీ చిక్కకూడదని తనకు తానే గొడ‌వ‌ను క్రియేట్ చేస్తాడు. అయితే, అక్కడే ఉన్న ఎస్ఐ నాగ‌రాజ్‌కు(అజ‌య్ రాజ్‌)కు, ఏఎస్ఐ భాషాకు మధ్య ఎప్పట్నుంచో విరోధం ఉంటుంది.

ALSO READ | Pushpa 2 Run Time: ఆర్ఆర్ఆర్ను దాటిన పుష్ప 2 ర‌న్ టైమ్.. ఇంత పెద్ద సినిమానా!

ఈ క్రమంలో నాగారాజ్ ఎలాగైనా గౌతమ్ అరెస్ట్ కాకుండా చూస్తాడు. కానీ, ఏఎస్ఐ భాషా త‌న‌ను కొట్టిన గౌత‌మ్‌ను అరెస్ట్ చేస్తాడు. ఎస్ఐ నాగ‌రాజ్ అత‌డిని కాపాడే ప్ర‌య‌త్నంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి? గౌతమ్ని పోలీసు కస్టడీకి తీసుకున్న తర్వాత ? ఈ క్రమంలో ఏర్కాడ్ ఏరియాలోనే నివేథా అనే అమ్మాయి డెడ్‌బాడీ ఎలా దొరుకుతుంది? నివేథాను చంపి పారిపోతున్న బాలు త‌న కారు కింద‌నే ప‌డ్డాడ‌ని స్టేష‌న్‌లోనే ఉన్న గౌత‌మ్‌కు ఎలా అర్థ‌మ‌వుతుంది?

అసలు నివేథాను ఎందుకు చంపాల్సి వస్తోంది? ఇక ఇదంతా గౌతమ్ చుట్టూరా ఎందుకు తిరుగుతోంది? తన కారులో ఉన్న డెడ్ బాడీని పోలీసులు కనిపెట్టే లోపే గౌతమ్ జైలు నుంచి బయటికి వెళ్లగలిగాడా? నివేథాకు గౌత‌మ్‌కు ఉన్న సంబంధం ఏంటీ? అధికారం బ‌లంతో ఓ పోలీస్ ఆఫీస‌ర్ చేసిన కుట్ర‌ల‌ను ఓ సాధార‌ణ యువ‌కుడు త‌న తెలివితేట‌ల‌తో ఎలా బ‌య‌ట‌పెట్టాడు? ఇలా తదితర విషయాలు తెలియాలంటే జరిగిందనేదే మిగిలిన కథ.

సినిమా ఎలా ఉందంటే::

హీరో కారులో డెడ్‌బాడీ..  అది తీరా పోలీస్ స్టేష‌న్ ముందే పార్క్ చేసి ఉండ‌టం.. ఆ చ‌నిపోయిన వ్య‌క్తి ఒక అమ్మాయి మ‌ర్డ‌ర్ కేసులో అనుమానితుడిగా ఉండ‌టం.. అత‌డి కోసం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం.. ఇక మరో ప్రక్క జైలులో ఉన్న హీరో తనదైన పంథాలో పోలీసులను ఇరికించడం..ఇలా ప్రతి పాయింట్ని డైరెక్టర్ తనదైన కోణంలో రాసుకుని తెరకెక్కించారు. ప్రతి సీన్తో ఆడియన్స్లో ఇంట్రెస్ట్ కలిగేలా గ్రిప్పింగ్‌ స్క్రీన్ ప్లేతో రావడంతోనే డైరెక్టర్ చాచీ సక్సెస్ అయ్యాడు. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ సినిమాలను ఇష్టపడేవారికి ఈ మూవీ తప్పకుండ మంచి ఫీలింగ్ ఇస్తోంది.