న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్స్ (ఐఐఎం) విద్యార్థులు దేశీ ఉత్పత్తులను లోకల్ నుంచి గ్లోబల్‌గా మార్చడంపై దృష్టి పెట్టాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. బ్రాండ్ ఇండియా మీద యువత ఫోకస్ చేయాలన్నారు. ఒడిషా, సంబాల్‌పూర్‌లోని ఐఐఎం క్యాంపస్ శాశ్వత నిర్మాణానికి సంబంధించి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో మోడీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకల్ నుంచి గ్లోబల్‌గా మారాలంటే ఐఐఎం స్టూడెంట్స్ సరికొత్త ఐడియాలతో ముందుకు రావాలన్నారు. దేశంలో 20 ఐఐఎంలు ఉన్నాయని, ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందుకెళ్లేందుకు వీటిల్లోని యువత కీలకపాత్ర పోషించాలన్నారు. ఈ దశాబ్దంలో దేశంలో కొత్త మల్లీనేషనల్ కార్పొరేషన్స్ (ఎంఎన్‌సీ)ల ఏర్పాటు పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.
