కల్తీ నూనె తయారీని అడ్డుకున్న కాలనీవాసులు

అయిజ, వెలుగు: పట్టణంలోని ఎస్సీ కాలనీ శివారులోని ముళ్ల పొదల్లో పశువుల వ్యర్ధాలు, కొవ్వుతో నూనె తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రతి ఆదివారం 8 పశువులు వధించి మాంసం విక్రయిస్తారు. మాంసం విక్రయించగా మిగిలిన కొవ్వు, ఎముకలు కాలనీకి దూరంగా తీసుకెళ్లి  ముళ్లపొదల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న షెడ్​లో ఉడికించి నూనె తయారు చేస్తారు. ఆ నూనెను తక్కువ ధరకు చాట్ బండార్, గోబీ సెంటర్లకు విక్రయిస్తున్నారు. శుక్రవారం కాలనీవాసులకు ఈ నూనె విక్రయించేందుకు తయారీదారులు ప్రయత్నించారు. 

ఈ క్రమంలో కాలనీవాసులు నూనె ఎక్కడి నుంచి తెచ్చారని ఆరా తీస్తే సమాధానం చెప్పకపోవడంతో వారిని అడ్డుకొని వెనక్కి పంపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అనారోగ్యానికి కారణమవుతున్న కల్తీ నూనె తయారీదారులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.