అగ్నివీర్ ను సద్వినియోగం చేసుకోవాలి : కల్నల్ వి సందీప్

వనపర్తి టౌన్, వెలుగు: యువత అగ్నివీర్ ను సద్వినియోగం చేసుకోవాలని వాయుసేన రిసోర్స్ పర్సన్, కల్నల్ వి సందీప్  సూచించారు. బుధవారం వనపర్తి గవర్నమెంట్  కో ఎడ్యుకేషన్  డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ ఎన్  శ్రీనివాస్ అధ్యక్షతన అగ్నివీర్  అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కల్నల్  సందీప్  అగ్నివీర్ పై అవగాహన కల్పించారు. 

దేశంలో ప్రతి ఒక్కరూ సైనికులుగా కొంత కాలం సేవలు అందించేందుకు, పటిష్టమైన దేశభద్రత కోసం అగ్నివీర్ ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. యూత్  అండ్  స్పోర్ట్స్  జిల్లా ఆఫీసర్ సుధీర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్  ఆఫీసర్​ ధాంసింగ్  పాల్గొన్నారు.