కరీంనగర్‌‌లో ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండానే రోడ్డెక్కుతున్నాబస్సులు

  • ఉమ్మడి జిల్లాలో ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెకింగ్​కు రాని బస్సులు 445
  • మొత్తం స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాలేజీ బస్సులు 1644
  • గడువు దాటి నెలైనా టెస్టులకు రాని వైనం 
  • తనిఖీలు చేస్తూ కేసులు పెడుతున్న ఆర్టీఏ ఆఫీసర్లు 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో కొన్ని పాఠశాలలు, కాలేజీల బస్సులు ఫిట్ నెస్ టెస్టులు చేయించుకోకుండానే రోడ్డెక్కుతున్నాయి. ట్యాక్స్ చెల్లించుకుండా, పొల్యూషన్ సర్టిఫికెట్లు లేకుండా దర్జాగా తిరిగేస్తున్నాయి. దీంతో ఆర్టీఏ ఆఫీసర్లు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ బస్సులను చెక్ చేస్తూ.. సరైన పత్రాలు లేని బస్సులను సీజ్ చేస్తున్నారు. కేసులు నమోదు చేయడంతోపాటు ఫైన్లు వేస్తున్నారు. రెండు రోజుల్లో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఫిట్ నెస్ లేకుండా రోడ్డెక్కిన 15 బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ట్యాక్స్ చెల్లించకుండా నడుపుతున్న మరో 19 బస్సులపై కేసులు పెట్టారు. ఇప్పటివరకు పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 3 బస్సుల చొప్పను సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. రెండురోజులుగా దాడులు నిర్వహిస్తున్నా ఫిట్ నెస్ టెస్టులకు ఇంకా 445 బస్సులు రాకపోవడం గమనార్హం. 

గడువు దాటి నెల రోజులు.. 

కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో కలిపి 786 బస్సులు ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభం కావడానికి ముందు జూన్ 10 వరకు 786 బస్సుల్లో 495 మాత్రమే ఫిట్ నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నాయి. మంగళ, బుధవారం మరో 90 బస్సుల వరకు ఫిట్ నెస్  టెస్టులకు వచ్చాయి. మొత్తంగా 585 బస్సుల ఫిట్ నెస్ పూర్తికాగా ఇంకా 201 బస్సులను స్కూల్, కాలేజీ యాజమాన్యాలు ఆర్టీఏ ఆఫీసుకు తీసుకురాలేదు.

అలాగే జగిత్యాలలో 467 బస్సులకు గానూ 354 బస్సులకు ఫిట్ నెస్ చెకింగ్ పూర్తికాగా, మరో 113 టెస్టులకు రాలేదు. పెద్దపల్లి జిల్లాలో 241 బస్సులకుగాను 140 బస్సులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 150 బస్సులకు 120 బస్సులకు మాత్రమే ఫిట్ నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. వాస్తవానికి మే 15తోనే జిల్లాలోని అన్ని బస్సుల ఫిట్ నెస్ గడువు ముగిసింది. గడువు ముగిసి నెల రోజులు కావొస్తున్నా  కొన్ని స్కూల్, కాలేజీల మేనేజ్ మెంట్లు పట్టించుకోవడం లేదు. 

ఆటోలు, మినీ వ్యాన్ల సంగతేంటి ? 

జిల్లాలో స్కూల్ పిల్లలను కేవలం బస్సుల్లో మాత్రమేగాక ఆటోలు, మినీ వ్యాన్లు, టాటా ఏస్ వాహనాల్లోనూ తరలిస్తున్నారు. అలాంటి వాహనాలపైనా దృష్టిసారించాలనే డిమాండ్ వినిపిస్తోంది. వీటిలో ఒక్కో ఆటోలో, వ్యాన్ లో సుమారు 10 నుంచి 15 మందిని ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. ఆర్టీఏ ఆఫీసర్లు కేవలం బస్సులను మాత్రమే చెక్ చేస్తున్నారనే ఈ వాహనాలపైనా దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

నిరంతరం టెస్ట్​ డ్రైవ్ నిర్వహిస్తాం..

ఫిట్ నెస్ టెస్టుల కోసం విద్యాసంస్థల యజమానులు ప్రతి బస్సును తీసుకురావాల్సిందే. మేం నిరంతరం టెస్ట్​ డ్రైవ్ నిర్వహిస్తాం. ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ టెస్టులకు రాని బస్సులను గుర్తించి ఆయా యాజమాన్యాలకు నోటీసులు పంపిస్తాం. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఇప్పటివరకు 201 బస్సులు టెస్టులకు రావాల్సి ఉంది. ఇందులో కొన్ని 15 ఏళ్లు పూర్తయినవి కూడా ఉండొచ్చు. ఇలాంటివి ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. ఫిట్ నెస్ లేకుండా రోడ్డెక్కి అనుకోని ప్రమాదం జరిగితే అందుకు యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తమ పిల్లలను పంపే బస్సులు, ఇతర వాహనాల విషయంలో ఏమైనా లోపాలుంటే తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేయొచ్చు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- పురుషోత్తం, డీటీసీ, కరీంనగర్