హైదరాబాద్ సిటీ, వెలుగు: స్కూల్ బంద్ పెట్టి లంచ్ పార్టీ చేసుకున్న టీచర్లపై హైదరాబాద్ కలెక్టర్అనుదీప్ దురిశెట్టి సీరియస్ అయ్యారు. వెలుగు దినపత్రికలో గత శనివారం వచ్చిన వార్తపై ఈ మేరకు ఆయన స్పందించారు. పార్టీకి హాజరైన 80 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతోపాటు వారికి అనుమతి ఇచ్చిన డిప్యూటీ ఐఓఎస్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. విచారణ జరిపించాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించగా, ఆయన యాక్షన్ తీసుకున్నట్టు సమాచారం.
డిప్యూటీ ఐఓఎస్ స్కూల్లోనే లంచ్పార్టీ
బంజారాహిల్స్‌లోని గతి స్కూల్లో కె.యాదగిరి గెజిటెడ్ హెచ్ఎంగా పనిచేస్తున్నారు. షేక్ పేట డిప్యూటీ ఇన్స్పెక్టర్ఆఫ్ స్కూల్స్ గా పూర్తి అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. డిప్యూటీ ఐఓఎస్ఆఫీస్ కూడా ఆయన పనిచేస్తున్న స్కూళ్లోనే ఉంది. అయితే, శుక్రవారం జరిగిన లంచ్పార్టీ కూడా గతి స్కూళ్లోనే జరిగింది. దీంతో నిబంధనలు ఉల్లఘించి అనుమతి ఇచ్చిన ఆయనపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు.