గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలి

  • మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు 


మెదక్​ టౌన్/సంగారెడ్డి టౌన్, వెలుగు : ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్​లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు రాహుల్ రాజ్, క్రాంతి వల్లూరు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025--–26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ఇంగ్లీష్​ మీడియంలో ప్రవేశాల కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.  

ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 1 లోపు https://tgcet.cgg.gov.in ద్వారా ఆన్​లైన్ లో తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం,  ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, పొటో అవసరమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుండి 9 వ తరగతి వరకు ఖాళీ సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.