31 నుంచి కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

  • ఏర్పాట్లపై ఎమ్మెల్యేతో కలిసి  కలెక్టర్  సమీక్ష

మమబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: తెలంగాణ తిరుపతిగా పేరొందిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్  విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్  జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్  సమీపంలో వెలసిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 18 వరకు జరుగుతాయని తెలిపారు. 

 జాతర ఏర్పాట్లపై శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి కలెక్టరేట్ లో జిల్లా స్థాయి కో ఆర్డినేషన్  కమిటీ సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పర్యవేక్షించాలని సూచించారు. అడిషనల్  కలెక్టర్  శివేంద్ర ప్రతాప్, అడిషనల్  ఎస్పీ రాములు, డీఆర్వో రవికుమార్, ఆలయ చైర్మన్  గోవర్ధన్ రెడ్డి, ఈవో మదన్ రెడ్డి పాల్గొన్నారు.