మహిళా సంఘాలకు జీవనోపాధి పెంచాలి  : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహిళా సంఘాలకు ఆదాయం పెరిగి,  కుటుంబాల  ఆర్థిక పరిస్థితులు పెరిగేలా  యూనిట్ల ఏర్పాటు చేసేందుకు అధికారులు  దృష్టి సారించాలని   కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.  సోమవారం  ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్   లో అర్జీలను తీసుకున్నారు. అనంతరం   అధికారులతో   రివ్యూ నిర్వహించారు.

 బ్యాంకు రుణాలతో  పచ్చళ్లు, తినుబండారాలు,కుట్లు,అల్లికలు,టైలరింగ్ లాంటి సాధారణ యూనిట్లు కాకుండ  అధిక ఆదాయం  వచ్చే యూనిట్లు పెట్టించాలని చెప్పారు. ప్రజావాణికి54 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు.  ఈ కార్యక్రమంలో  అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, కలెక్టర్  యస్. మోహన్ రావు,  డిఆర్ఓ రవికుమార్, జెడ్పి సీఈవో వెంకటరెడ్డి పాల్గొన్నారు. 

 ప్రజావాణికి 42 అర్జీలు 

గద్వాల:  ప్రజావాణి కార్యక్రమం ద్వారా    సమస్యలను  పరిష్కరిస్తున్నట్టు   కలెక్టర్ సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ హాల్ లో  ప్రజావాణి  నిర్వహించారు.  జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 42 మంది అర్జీలు ఇచ్చారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస రావు, నర్సింగ్ రావు, ఆర్డిఓ రామచందర్   వివిధ శాఖల జిల్లా అధికారులు,  పాల్గొన్నారు.
వనపర్తి  :  జిల్లా ప్రజావాణి ఫిర్యాదులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే  ఫిర్యాదులను  త్వరగా పరిష్కరించాలని అడిషనల్​  కలెక్టర్  సంచిత్ గంగ్వార్ ఆదేశించారు.

 సోమవారం అడిషనల్​  కలెక్టర్ నగేశ్​ తో కలిసి  ఫిర్యాదులను స్వీకరించారు.   మొత్తం  55 ఫిర్యాదులు వచ్చాయి. సీఎం  ప్రజావాణి నుంచి జిల్లాకు ఇప్పటి వరకు ఆయా శాఖలకు సంబంధించిన 297 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని సంబంధిత శాఖలకు పంపించగా ఇప్పటి వరకు 114 ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయని  తెలిపారు.   జిల్లా ప్రజావాణి ఫిర్యాదులను సైతం ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.      జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో  ఎస్పీ  రావుల గిరిధర్  ప్రజావాణి కార్యక్రమం లో   12 దరఖాస్తులను స్వీకరించారు.