ఇంటింటి సర్వేకు ఏర్పాట్లు పూర్తి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఇంటింటి సర్వేకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్  విజయేందిర బోయి తెలిపారు. సోమవారం కలెక్టర్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. సర్వే నిర్వహించేందుకు జిల్లాలో 2,253 ఎన్యుమరేషన్​ బ్లాక్ లను ఏర్పాటు చేశామని, 150 ఇండ్లను ఒక బ్లాక్ గా గుర్తించామని తెలిపారు.

 జిల్లాలో 1,880 మంది ఎన్యుమరేటర్లను నియమించినట్లు వెల్లడించారు. సర్వేకు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు ఆధార్, రేషన్  కార్డులను సిద్ధంగా ఉంచుకొని, సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎల్ఆర్ఎస్  దరఖాస్తుల పరిశీలనకు స్పెషల్​ డ్రైవ్  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 98, 220 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు 17 వేల దరఖాస్తులు పరిష్కరించినట్లు చెప్పారు. అడిషనల్​ కలెక్టర్  శివేంద్ర ప్రతాప్, డీపీఆర్వో శ్రీనివాస్  ఉన్నారు.