ప్రజా పాలన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ విజయేందిర బోయి

మమబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్  విజయేందిర బోయి తెలిపారు. ఈ నెల 17న ఉదయం 9:15కు ఆర్అండ్ బీ గెస్ట్​హౌస్​ సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులు అర్పిస్తారని, 10 గంటలకు కలెక్టరేట్ లో  జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. 

వనపర్తి: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి వనపర్తి కలెక్టరేట్​లో ఏర్పాట్లు పూర్తి చేశారు. బిల్డింగ్​ను ముస్తాబు చేశారు. తెలంగాణ స్టేట్​ షెడ్యూల్డ్​ క్యాస్ట్స్​ కో -ఆపరేటివ్​ డెవలప్​మెంట్ కార్పొరేషన్​ లిమిటెడ్​ చైర్మన్​​ప్రీతమ్​ జాతీయ జెండాను ఎగురేస్తారు. స్వాతంత్ర్య సమరయోధులు, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానిస్తారు.నాగర్ కర్నూల్ టౌన్: నాగర్ కర్నూల్  కలెక్టరేట్​లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్  బదావత్  సంతోష్  తెలిపారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. చీఫ్​ గెస్ట్​ సందేశం, విద్యార్థుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొని సక్సెస్​ చేయాలని కోరారు.