మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : జిల్లాలో వడ్ల కొనుగోళ్లపై కలెక్టర్ విజయేందిర బోయి సమీక్షించారు. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్లలో కొనుగోలు చేసిన వడ్లు, చెల్లింపులపై సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ చేశారు.
వడ్లు కొనుగోలు చేసిన వెంటనే వివరాలు ఆన్లైన్ లో ఎంట్రీ చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన వడ్లకు త్వరగా చెల్లింపులు చేయాలన్నారు. డీఆర్డీవో నర్సింహులు, జిల్లా సహకార అధికారి శంకరాచారి పాల్గొన్నారు.