ఆర్ అండ్ ఆర్ పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ విజయేందిర బోయి  

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ పనులు త్వరగా కంప్లీట్ చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ ఆర్ అండ్ ఆర్ అవార్డు పనులు త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

రిహాబిటేషన్ సెంటర్ లో అంతర్గత రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, మిషన్ భగీరథ పైప్ లైన్, తాగునీటి వసతుల కల్పన తదిదర పనులు స్పీడప్ చేయాలని సూచించారు.  రివ్యూలో అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, స్పెషల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, అధికారులు పాల్గొన్నారు.