స్కూళ్లలో వర్క్స్​ కంప్లీట్​ చేయాలి : ఉదయ్ కుమార్

ఉప్పునుంతల, వెలుగు: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనులను వెంటనే కంప్లీట్​ చేయాలని కలెక్టర్  ఉదయ్ కుమార్  ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్, జడ్పీ హైస్కూల్​ను కలెక్టర్  తనిఖీ చేశారు. స్కూల్​ విద్యార్థులను ప్రశ్నలడిగి వారిని అభినందించారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. మండలంలోని 33 స్కూళ్లలో చేపట్టిన పనులకు సంబంధించిన నివేదికలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. స్టూడెంట్లకు బుక్స్​ పంపిణీ చేశారు. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. ఆర్డీవో మాధవి, ఎంపీడీవో బాలచంద్ర సుజన్ ఉన్నారు.