నోడల్  ఆఫీసర్లదే కీలకపాత్ర : కలెక్టర్  ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఎన్నికల్లో నోడల్  అధికారుల పాత్ర కీలకమని, విధులను బాధ్యతగా నిర్వర్తించాలని కలెక్టర్  ఉదయ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్  మీటింగ్ హాల్​లో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 22 మంది నోడల్ అధికారులను నియమించామని, తమ విధులుపై అవగాహన కలిగి ఉండాలనారు. ఆఫీసర్లకు ట్రైనింగ్ ఏర్పాటు చేయాలని, ఈవీఎం ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్  నిర్వహణ, హోమ్ ఓటింగ్, పోలింగ్  పర్సన్స్  డేటా ఎంట్రీపై దృష్టి పెట్టాలన్నారు. అడిషనల్​ కలెక్టర్లు కుమార్ దీపక్, కె సీతారామారావు పాల్గొన్నారు.

సౌలతులు కల్పించాలి..

టెన్త్​ ఎగ్జామ్​ సెంటర్లలో స్టూడెంట్లకు ఇబ్బంది కలగకుండా సౌలతులు కల్పించాలని కలెక్టర్  ఉదయ్ కుమార్  సూచించారు. జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్​ హైస్కూల్​ను తనిఖీ చేశారు. కేంద్రంలోని సౌలతులను పరిశీలించి పలు సూచనలు చేశారు. చీఫ్‌‌‌‌‌‌‌‌  సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌తో పాటు ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తరువాతే అనుమతించాలని, సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్ర విద్యా శాఖ జాయింట్  డైరెక్టర్  వెంకట నరసమ్మ పాల్గొన్నారు.