ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి : తేజస్ నందలాల్ పవార్

వనపర్తి, వెలుగు: ప్రజావాణిలో వచ్చే అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు  పరిష్కరించాలని కలెక్టర్  తేజస్ నందలాల్  పవార్  అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి అర్జీదారులకు సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి 62 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ ​తెలిపారు. సీపీవో వెంకటరమణ, జడ్పీ సీఈవో యాదయ్య పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ టౌన్: ప్రజావాణిలో భాగంగా సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జడ్పీ సీఈవో దేవసహాయం అర్జీలను స్వీకరించారు. 28 ఫిర్యాదుల్లో 17 రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నాయి. వాటిని సంబంధిత అధికారులకు అందజేసి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. స్పెషల్  అడిషనల్​ కలెక్టర్  కేఎల్ఐ అరుణ, డీపీవో కృష్ణ, సీపీవో భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ALSO READ : ద్వితీయశ్రేణి నగరాల అభివృద్ధి మాటేంటి? 

గద్వాల: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని అడిషనల్  కలెక్టర్  వెంకటేశ్వర్లు ఆఫీసర్లను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. 35 దరఖాస్తులు వచ్చినట్లు అడిషనల్​ కలెక్టర్​ తెలిపారు.