రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలి : తేజస్ నందలాల్ పవార్

వనపర్తి టౌన్, వెలుగు: జూన్ 2న    రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను  ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం  కలెక్టరేట్​లో   రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై   అధికారులతో సమావేశం నిర్వహించారు.    అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకలను    ఐడీఓసీ   నిర్వహించాలన్నారు. 

 జూన్ 2న ఉదయం 9 గంటలకు జాతీయ జెండావిష్కరణ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం ఉదయం 9.30 గంటలలోపే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని చెప్పారు.  కార్యక్రమంలో   అడిషనల్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎం నగేశ్​    తదితరులు పాల్గొన్నారు.