వనపర్తిలో 72 గంటల పాటు నిఘా ఉంచాలి : తేజస్  నందలాల్  పవార్

వనపర్తి, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు రానున్న 72 గంటలు అత్యంత కీలకమని,  - పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని ఎన్​ఫోర్సుమెంట్​ ఆఫీసర్లను కలెక్టర్​ తేజస్  నందలాల్  పవార్  ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని  కాన్ఫరెన్స్  హాల్​లో ఎన్​ఫోర్స్​మెంట్, నోడల్, సెక్టోరియల్  ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని, బాధ్యులను పట్టుకొనేందుకు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

ఎక్కడ చిన్న అనుమానం వచ్చినా వెంటనే పోలీస్  ఆఫీసర్లకు, తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు .   బ్యాంకుల నుంచి ఎక్కువ మొత్తం విత్​డ్రా చేసిన ఖాతాదారులపై నిఘా పెట్టాలన్నారు. లిక్కర్ షాపుల ఓనర్లు రూల్స్​ బ్రేక్​ చేస్తే కేసులు పెట్టాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని పోలింగ్  కేంద్రాల్లో మౌలిక వసతులు, నీడ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, నగేశ్, డీఎస్పీ వెంకటేశ్వర రావు, ఆర్డీవో పద్మావతి, స్పెషల్​ డిప్యూటీ కలెక్టర్  వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.