మార్కులే కొలమానం కాదు.. వైరల్ అవుతున్న ఐఏఎస్ టెన్త్ మార్క్స్ లిస్ట్

మార్కులే కొలమానం కాదు..  వైరల్ అవుతున్న ఐఏఎస్ టెన్త్ మార్క్స్ లిస్ట్

పరీక్షల్లో మార్కులు తక్కువొస్తే కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. దీనిక కారణం ఆ విద్యార్థి పెరిగిన వాతావరణం, చదువు చెప్పిన ఉపాధ్యాయులే కారణం. చిన్నప్పటి నుంచీ కేవలం మార్కులే కొలమానంగా విద్యనందించే టీచర్లు, మార్కులు ఎక్కువొస్తేనే తప్ప కెరీరుండదు, సమాజంలో విలువుండదు అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఇలాంటి ఆత్మహత్యలను ఆపడం చాలా కష్టం. కానీ ప్రస్తుత సమాజంలో పెద్ద పెద్ద కంపెనీలల్లో, హోదాలో ఉన్న వారంతా ఏదో ఒకసారి ఫెయిల్ అయిన వారే. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుంటే ఏ గొడవా ఉండదు. ఆ కోవకే చెందిన వారు కలెక్టర్ హోదాలో ఉన్న తుషార్ డి సుమేరా. పలు రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో సుమేరా పదో తరగతిలో సాధించిన మార్కుల జాబితాతో పాటు, ఆయన ఫొటోను కూడా షేర్ చేస్తూ మరో ఐఏఎస్ అధికారి ట్వీట్ చేశారు.

ఈ ఐఏఎస్ అధికారి షేర్ చేసిన సుమేరా టెన్త్ ఫలితాలను గనక గమనిస్తే.. ఆయన కేవలం పాస్ మార్కులనే సాధించినట్టు తెలుస్తోంది. 100మార్కులకు గాను ఇంగ్లీష్ లో 35, గణితంలో 36 మార్కులే రావడం గమనార్హం. ఈ మార్కులు చూడగానే అందరూ ఇంత తక్కువ మార్కులొచ్చాయి.. నువ్వేం సాధించగలవు అన్న వాళ్లూ లేకపోలేదు. కానీ సుమేరా ఈ రోజు కలెక్టర్ అయ్యి ప్రజలకు సేవలందిస్తున్నారంటే.. కారణం కేవలం మార్కులు మాత్రమే కొలమానం కాదని అర్థమవుతోంది. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ కావడంతో సుమేరా స్పందించి.. అవనీశ్ శర్మకు ధన్యావాదాలు తెలియజేశారు. అయితే 2012 బ్యాచ్ కు చెందిన సుమేరా.. ప్రస్తుతం భరుచ్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. యూపీఎస్సీలో ర్యాంకు సాధించి భేష్ అనిపించుకున్నారు. అంతకుముందు  ఓ పాఠశాల ఉపాధ్యాయునిగానూ పనిచేసినట్టు సమాచారం.