ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి :కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్  సిక్తా పట్నాయక్  సూచించారు. గురువారం మండలంలోని సింగారం గ్రామంలోని ప్రైమరీ, హైస్కూల్​ ఆవరణలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఇంటిలో  మొక్కలు నాటడంతో వర్షాలు సకాలంలో కురుస్తాయని తెలిపారు. డీఆర్డీవో మొగులప్ప పాల్గొన్నారు.

ఊట్కూర్: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యం బాగుందని కలెక్టర్  సిక్తా పట్నాయక్  టీచర్లను అభినందించారు. మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్​లో జీపీఎస్ ను పరిశీలించారు. ఐదో తరగతి స్టూడెంట్ల సామర్థ్యాన్ని పరిశీలించారు. ఇంగ్లిష్​పై పట్టు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏఎంవో విద్యాసాగర్, ఎస్ వో శ్రీనివాస్, తహసీల్దార్   రవి, ఎంపీడీవో ధనుంజయ, హెచ్ఎం పద్మ, అనిత పాల్గొన్నారు.