ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు: జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్  దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్   సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన ఛాంబర్ లో రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా ఎక్కువగా పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్  దరఖాస్తుల వివరాలను పంచాయతీ కార్యదర్శులు అడిగి తెలుసుకున్నారు. పదుల సంఖ్యలో దరఖాస్తులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని ప్రశ్నించారు.

 రెగ్యులరైజేషన్  కోసం యాప్ లో ఉన్న ఒక్కో అంశాన్ని పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఎంపీవోలు పంచాయతీ కార్యదర్శులకు సూచనలు ఇస్తూ దరఖాస్తులను పరిష్కరించాలని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిలిపేయాలన్నారు. డీపీవో కృష్ణ, ఎంపీడీవో పావని, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.