రైతులకు రూ.500 బోనస్ పై అనుమానాలు వద్దు : కలెక్టర్ సిక్త పట్నాయక్

నారాయణపేట, వెలుగు: ప్రభుత్వం సన్నాలకు ఇస్తున్న రూ.500 బోనస్ పై  రైతులు ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. సోమవారంఆమె దామరగిద్ద మండలంలోని మల్ రెడ్డిపల్లి, లోకూర్తి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మల్ రెడ్డి పల్లి కొనుగోలు కేంద్రంలో ప్యాడి క్లీనర్ యంత్రంలో ధాన్యం వేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదని అక్కడి సిబ్బంది కలెక్టర్ కు చెప్పడంతో రైతులతో ప్యాడీ క్లీనర్ లో వడ్లు వేయించి పరిశీలించారు. అనంతరం సమగ్ర సర్వేను పర్యవేక్షించారు. తర్వాత లోకూర్తి గ్రామ రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమశాతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎం దేవదాస్, ఎంపీడీవో సాయిలక్ష్మి, ఐకేపీ, సింగిల్ విండో అధికారులు పాల్గొన్నారు.