భూసేకరణ స్పీడప్​ చేయాలి : సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు: జిల్లాలో భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్  సిక్తా పట్నాయక్  సూచించారు. బుధవారం తన ఛాంబర్ లో పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులపై అడిషనల్​ కలెక్టర్  అశోక్ కుమార్, స్పెషల్  డిప్యూటీ కలెక్టర్  సీహెచ్ విశాలాక్షి, ఎస్డీసీ అధికారులతో సమీక్ష జరిపారు.

రాజీవ్  ఎత్తిపోతల పథకం–-1 కింద  82.35 ఎకరాల భూసేకరణకు సంబంధించిన పరిహారం డబ్బులు రైతులకు అందాయా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. మిగిలిన భూసేకరణను స్పీడప్​ చేయాలన్నారు. కోయిల్ సాగర్  ప్రాజెక్టు పరిధిలో భూసేకరణపై ఆరా తీశారు. నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ భూసేకరణ కంప్లీట్​ చేయాలన్నారు.