ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన కలెక్టర్

మక్తల్, వెలుగు : మక్తల్ లోని ప్రభుత్వ స్థలాలను శుక్రవారం కలెక్టర్  సిక్తా పట్నాయక్  పరిశీలించారు. పట్టణంలో కొత్తగా నిర్మించనున్న150 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం పట్టణ శివారులోని 916, 917 సర్వే నంబర్లలోని పదెకరాల స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని ట్యాంక్  బండ్  సమీపంలోని సర్వే నంబర్ 316లోని స్థలాన్ని మున్సిపల్  షాపింగ్  కాంప్లెక్స్ నిర్మాణం కోసం పరిశీలించారు.

మక్తల్  మండలం గొల్లపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 126 లోని 18 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  స్కూల్  నిర్మాణం కోసం పరిశీలించి, ప్రధాన రహదారి నుంచి ఎంత దూరం ఉంటుందో తెలుపుతూ పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసి ఇవ్వాలని తహసీల్దార్​ సతీష్  కుమార్, సర్వేయర్  రాజన్నను ఆదేశించారు.