చెరువును పరిశీలించిన కలెక్టర్

ధన్వాడ, వెలుగు: మండల కేంద్రంలోని పెద్ద చెరువును బుధవారం కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ పరిశీలించారు. వర్షాలతో చెరువులోకి భారీగా వరద రావడంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. కట్ట తెగిపోతుందనే ఆందోళనతో రైతులు ఒకచోట గండి పెట్టారు. బుధవారం చెరువును పరిశీలించిన కలెక్టర్.. రిపేర్లకు ఎంత ఖర్చు అవుతోందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గండిని పూడ్చి వేయాలని అధికారులకు సూచించారు.

పాతపల్లి వాగును పరిశీలించి, వాగులో ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న పిల్లలను బయటకు పంపించవద్దని పేరెంట్స్​కు సూచించారు. అనంతరం పీహెచ్​సీని తనిఖీ చేసి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్​ ఈఈ బ్రహ్మానందం, తహసీల్దార్​ సింధూజ, ఎంపీడీవో సాయికృష్ణ, డీఈ కిరణ్, ఏఈ సదానంద్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్​రావు ఉన్నారు.