నారాయణపేట జిల్లాలో హెలిప్యాడ్ స్థలాన్ని  పరిశీలించిన కలెక్టర్ : సిక్తా పట్నాయక్

మద్దూరు, వెలుగు : నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఈ నెల 26న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మద్దూరు మండలం నిడ్జింత వెళ్లే మార్గంలో ఏర్పాటు చేస్తున్న సీఎం హెలిప్యాడ్ స్థలాన్ని గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. హెలిప్యాడ్ ఏర్పాటుకు ఆర్అండ్ బీ, పోలీస్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో కల్పించాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. వాహనాల పార్కింగ్, రూట్ మ్యాప్, రోడ్ క్లియరెన్స్, ఫైర్, అంబులెన్స్ తదితర ఏర్పాట్ల పై అధికారులకు కలెక్టర్ సలహాలు, సూచనలిచ్చారు. కాగా, మద్దూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సతీశ్ ఇటీవలే మరణించగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 26న ముఖ్యమంత్రి రానున్నారు.