మెనూ ప్రకారం భోజనం అందించాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్  సిక్తా పట్నాయక్  ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల, బాలుర హాస్టళ్లను పరిశీలించారు. విద్యార్థినులకు  వడ్డిస్తున్న అల్పాహారం, వంట గదిలో నిల్వ ఉంచిన కూరగాయలను పరిశీలించారు. అనంతరం డార్మెటరీకి వెళ్లి విద్యార్థినులకు సరిపడా దుప్పట్లు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని ఆరా తీశారు. 

మెనూ బోర్డు ప్రకారం కిచిడి పెట్టాల్సి ఉండగా, జీరా రైస్  వడ్డించడంపై సిబ్బందిని ప్రశ్నించారు. వేరే అల్పాహారం ఎలా పెట్టారని నిలదీశారు.  ఇకపై మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన ఆహారం అందించాలని సూచించారు. అనంతరం ఎస్సీ బాలుర హాస్టల్​ను సందర్శించి అల్పాహారాన్ని పరిశీలించి, ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.