ఎన్సీసీ వల్ల సేవాభావం పెరుగుతుంది

గద్వాల, వెలుగు: ఎన్సీసీతో స్టూడెంట్లలో విద్యతో పాటు క్రమశిక్షణ, సేవాభావం పెరుగుతుందని కలెక్టర్  సంతోష్  పేర్కొన్నారు. మంగళవారం గద్వాలలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో 77వ ఎన్సీసీ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చీఫ్​ గెస్ట్​గా హాజరైన కలెక్టర్​తో పాటు ఇన్​చార్జి డీఈవో కాంతమ్మకు ఎన్సీసీ క్యాడెట్లు స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోనే అత్యధిక స్టూడెంట్స్  ఉన్న అభ్యసన స్కూల్ లో ఈ ఏడాది ఎన్సీసీ యూనిట్​ను ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. విద్యార్థులను సామాజిక సేవలో భాగస్వాములు చేసేందుకు టీచర్లు కృషి చేయాలని కోరారు. కర్తవ్యం, ఐక్యమత్యం, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడమే ఎన్సీసీ లక్ష్యమన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద మరుగుదొడ్లకు రూ. లక్ష మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. హెచ్ఎం వెంకట నరసయ్య, సీటీవో రాముడు పాల్గొన్నారు.