గ్రూప్​3 ఎగ్జామ్స్​కు 25 సెంటర్లు : సంతోష్

  • కలెక్టర్ సంతోష్  

గద్వాల, వెలుగు:  గ్రూప్-3 ఎగ్జామ్స్ ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో ఆఫీసర్లతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   ఈనెల 17, 18న  ఎగ్జామ్స్  ఉంటాయని తెలిపారు.  అభ్యర్థులు సకాలంలో ఎగ్జామ్ కేంద్రాలకు హాజరుకావాలన్నారు. ఆలస్యం అయిన వారిని  ఎట్టి పరిస్థితుల్లో  అనుమతించబోమన్నారు.  జిల్లాలో 25 ఎగ్జామ్స్ సెంటర్లను  ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

మొత్తం 8570 మంది అభ్యర్థులు హాజరు  కానున్నారని , 25 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 25 మంది డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు, 5గురు రూట్ ఆఫీసర్లు, 5 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 64 మంది ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లను నియమించినట్లు ఆయన తెలిపారు. ఎగ్జామ్స్ సెంటర్ల దగ్గర అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగ రావు, రీజినల్ కో-ఆర్డినేటర్ రామ్మోహన్,  చీఫ్ సూపరింటెండెంట్లు, నోడల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వార్డ్ అధికారులుపాల్గొన్నారు.