చైల్డ్ లేబర్ నిర్మూలనకు కృషి చేయాలి : కలెక్టర్ సంతోష్

  • కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: జిల్లాలో చైల్డ్ లేబర్ వ్యవస్థను, చైల్డ్ మ్యారేజ్​లను   అరికట్టేందుకు ఆఫీసర్లు అందరూ కోఆర్డినేషన్ తో పని చేయాలని  కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టర్ ఆఫీస్ లోనే  కాన్ఫరెన్స్ హాలులో మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ కోసం జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..   జిల్లాలోని గట్టు, కేటిదొడ్డి, మల్దకల్ మండలాల్లో అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టి బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించేలా  చర్యలు చేపట్టాలన్నారు. 

బాల  కార్మిక,   బాల్య వివాహాల  వ్యవస్థను నిర్మూలించేందుకు పోలీసు శాఖ   పూర్తి సహకారం అందించాలన్నారు.  జిల్లాలో ఇప్పటి వరకు బడి మానేసిన 945 పిల్లలను గుర్తించి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించి 800 మందిని తిరిగి పాఠశాలల్లో చేర్పించామన్నారు. అనంతరం ఆఫీసర్లతో కలిసి ప్రతిక్షణం అప్రమత్తం - సురక్షితం అనే కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ మీటింగ్ లో జిల్లా అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, జెడ్పి సీఈఓ కాంతమ్మ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి,  లేబర్ ఆఫీసర్ మహేష్ కుమార్, వైద్య, పోలీసు వివిధ శాఖల సహాయ అధికారులు పాల్గొన్నారు.