పది ఫలితాల్లో ఎందుకు వెనుక పడ్డాం? : కలెక్టర్ సంతోశ్

  •     ఎడ్యుకేషన్ ఆఫీసర్లను  ప్రశ్నించిన కలెక్టర్

గద్వాల, వెలుగు : సర్కార్ బడుల్లో అన్ని సౌలతులు కల్పిస్తున్న ఈసారి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఎందుకు వెనుకపడ్డామని జిల్లా కలెక్టర్ సంతోశ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను ప్రశ్నించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వచ్చే విద్యా సంవత్సరం ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో చివరి రెండో ప్లేస్ లో ఉండడం సరికాదన్నారు.

కచ్చితంగా టీచర్లు నిబద్ధతతో పని చేయాలని వెనుకబాటుకు గల కారణాలను విశ్లేషించి ముందుకు వెళ్లాలన్నారు. జూన్ నెలలోనే జిల్లాస్థాయి ప్రత్యేక ఆఫీసర్లను నియమించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.

అవసరమైతే ఎన్జీవోల సహకారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ ఇందిరా, ఎస్సీ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్వేతా ప్రియదర్శిని, జిల్లా ఎగ్జామ్స్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.