మహిళా శక్తి స్కీంపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు : మహిళా శక్తి స్కీమ్​ అమలు  స్పీడ్ అప్ చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్​లో బ్యాంకర్స్ ఆఫీసర్లతో స్కీం పై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీర్ఘకాలంగా ఉపయోగపడే యూనిట్లపై దృష్టి పెట్టి వాటిని గ్రౌండింగ్ చేసేలా చూడాలన్నారు. అసిస్టెంట్ ప్రోగ్రాం మేనేజర్లు కమ్యూనిటీ కోఆర్డినేటర్లు టార్గెట్ పెట్టుకొని యూనిట్లను ఏర్పాటు చేయించాలన్నారు. 

జిల్లాలో మైక్రో ఎంటర్​ప్రైజెస్​  యూనిట్లు చాలా తక్కువగా ఉన్నాయని వాటిపై దృష్టి పెట్టాలని ,  ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల దరఖాస్తులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, ఎల్డీఎం అయ్యప్ప రెడ్డి, అగ్రికల్చర్ ఏడీ సక్రియ నాయక్, ఫిషరీస్​  ఏడీ షకీలా భాను పాల్గొన్నారు.