సెక్టోరల్ ఆఫీసర్ల పాత్ర కీలకం : సంతోష్  

గద్వాల, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్  ఆఫీసర్ల పాత్ర కీలకమని కలెక్టర్  సంతోష్  పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో సెక్టోరియల్  ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై సెక్టోరియల్  ఆఫీసర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల అనుసంధానం, మాక్ పోలింగ్, హ్యాండ్ బుక్ పై పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని సూచించారు. పోలింగ్  స్టేషన్లలో సౌలతులు ఉండేలా చూసుకోవాలన్నారు. పోలింగ్ స్టేషన్లపై అవగాహన కలిగి ఉండాలన్నారు. డీఆర్డీవో నరసింహారావు, ఆర్డీవో రాంచందర్, నరేశ్​ ఉన్నారు.