తప్పులు లేకుండా సర్వే నిర్వహించాలి : సంతోష్

  • కలెక్టర్ సంతోష్ 

గద్వాల, వెలుగు: ఇంటింటి సర్వేను  తప్పులు లేకుండా  చేయాలని  కలెక్టర్ సంతోష్ అన్నారు.  శనివారం ఇటిక్యాల మండలం పెద్దదిన్నె గ్రామంలోని తొమ్మిదో వార్డులో నిర్వహిస్తున్న సర్వేను కలెక్టర్ తనిఖీ చేశారు. ఇంటి యజమానితో పాటు కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసి పొందుపరిచిన కోడ్ నెంబర్లు వేయాలన్నారు. 

పార్ట్ 1లో  యజమాని వివరాలతో పాటు పార్ట్ 2 లో కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు,  వార్షిక ఆదాయం  వివరాలను పొందుపరచాలని  చెప్పారు.  సర్వేపై అసత్య ప్రచారాలు నమ్మొద్దని ప్రజలకు  సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, డీపీఓ శ్యాంసుందర్,  తహసీల్దార్​ నరేందర్, ఎంపీడీవో ఎండీ అజర్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ గా నమోదు చేసుకోవాలి

జనవరి ఒకటి 2025 నాటికి 18 ఏళ్లు కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు ఒకటి నమోదు చేసుకోవాలని  కలెక్టర్ సంతోష్ సూచించారు. శనివారం ఇటిక్యాల మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని  తనిఖీ చేశారు.

ఓటరు  జాబితాను తప్పకుండా ప్రదర్శించాలి

వనపర్తి :  ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-2025 లో భాగంగా  నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపైన్ డేస్ లో ప్రతి పోలింగ్ బూత్ లోను ఓటర్ల జాబితాలను తప్పకుండా ప్రదర్శించాలని  కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని మర్రికుంఠలోని 179, బండారు నగర్ లోని  పోలింగ్ బూత్ లను  పరిశీలించారు.  ఓటర్ జాబితాలో డబుల్ ఓట్లు ఉంటే వాటిని ఫారం - 7 ద్వారా తొలగించాలని, మార్పులు ఏమైనా ఉంటే ఫారం - 8 ద్వారా చేయాలని సూచించారు. 

1-1-. 2025 నాటికి 18 ఏండ్లు నిండిన యువత ఎవరైనా కొత్తగా ఓటర్ గా నమోదు చేసుకోవలనుకుంటే  ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎవరైనా ఓటర్లు మరణించిన పక్షంలో వారిని జాబితా నుంచి తొలగించాలని సూచించారు. బీఎల్ఓ అప్లికేషన్ ద్వారా సవరణలు చేయాలన్నారు. ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రమేశ్​ రెడ్డి, మున్సిపల్​  కమిషనర్ పూర్ణ చందర్, బీఎల్ఓలు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.