మాస్ కాపీయింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు

గద్వాల, వెలుగు: ఇంటర్  ఎగ్జామ్స్ లో మాస్ కాపీయింగ్ కు పాల్పడకుండా ఇన్విజిలేటర్లు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్  సంతోష్ ఆదేశించారు. శనివారం గద్వాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్  కాలేజీ ఎగ్జామ్  సెంటర్ ను ఆయన తనిఖీ చేశారు. 

ఎగ్జామ్​ సెంటర్లలో సౌలతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఇంటర్  ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నారు. కలెక్టర్  వెంట డీఐఈవో ఉదయరాజు, ప్రిన్సిపాల్  ఉన్నారు.