స్కీమ్స్ పై అవగాహన పెంచుకోవాలి

గద్వాల, వెలుగు: ఫీల్డ్ లో గవర్నమెంట్  స్కీమ్స్  అమలు తీరును పరిశీలించి అవగాహన పెంచుకోవాలని ట్రైనీ ఐఏఎస్, సీసీఎస్  ఆఫీసర్లకు కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్​స్టిట్యూట్  నుంచి జిల్లాకు వచ్చిన 25 మంది శిక్షణ ఆఫీసర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు.

జోగులాంబ గద్వాల జిల్లా భౌగోళిక స్థితి, నియోజకవర్గాలు, మండలాలు, పట్టు చీరలు, అలంపూర్  ఆలయం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, చారిత్రక కోటలు తదితర అంశాలను వివరించారు. జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, చేపడుతున్న కార్యక్రమాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అడిషనల్​  కలెక్టర్‌‌‌‌‌‌‌‌ నర్సింగ రావు‌‌‌‌‌‌‌‌, జడ్పీ సీఈవో కాంతమ్మ పాల్గొన్నారు.

 బసాపురం సందర్శించిన ట్రైనీ కలెక్టర్లు

అలంపూర్: ఉండవెల్లి మండలం బస్వాపురం గ్రామాన్ని ఐదుగురు ట్రైనీ సివిల్  సర్వీస్  అధికారులు సందర్శించారు. గ్రామానికి వచ్చిన ఆఫీసర్లకు గ్రామస్తులు భాజాభజంత్రీలు, బతుకమ్మలతో స్వాగతం పలికి బొకేలు అందజేశారు. ఎంపీడీవో తిరుపతన్న గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తదితర అంశాలను వివరించారు. లోకేశ్​కుమార్, రామకృష్ణ శరణ్, ప్రతీక్  గెహ్లాట్, అతుల్  కుమార్  సింగ్, హిమాన్షు త్యాగి, ఉన్నారు.