హైవే పనులు స్పీడప్​ చేయాలి : రవి నాయక్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్– చించోలి హైవే పనులు స్పీడప్​ చేయాలని కలెక్టర్  రవి నాయక్  సంబంధిత అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్  నుంచి చించోలి వరకు నిర్మిస్తున్న 167 హైవే పనులపై బుధవారం కలెక్టరేట్  మీటింగ్​ హాల్​లో రెవెన్యూ, అటవీ శాఖ, నేషనల్  హైవే అధికారులతొ కలెక్టర్  రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ హైవే నిర్మాణంలో భాగంగా భూ సేకరణ వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే సేకరించిన భూములకు సంబంధించి నష్ట పరిహారం చెల్లింపులో ఆలస్యం చేయకుండా  యజమానులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 60 కిలోమీటర్ల రోడ్​ నిర్మాణం జరగాల్సి ఉండగా, 40 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. అడిషనల్  కలెక్టర్  మోహన్ రావు, నేషనల్  హైవే ఈఈ రమేశ్, ఆర్డీవో నవీన్​ కుమార్, ఫారెస్ట్   ఆఫీసర్​ సత్యనారాయణ పాల్గొన్నారు.