రోగులకు అత్యుత్తమ వైద్య సేవలందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

పాపన్నపేట, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అత్యుత్తమ వైద్య సేవలందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని పోడ్చక్​పల్లి ప్రైమరీ హెల్త్​సెంటర్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్ సీ లోని ల్యాబ్​, మందుల గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ మొదలైన వాటిని పరిశీలించారు.

 దవాఖానకు రోజు ఎంత మంది రోగులు వస్తున్నారని, ఈ నెలలో ఎన్ని డెలివరీలు చేశారని వైద్యాధికారులని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత , పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాస్​రెడ్డి, అలీ, భద్రప్ప ఉన్నారు.

ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అన్నారు. శుక్రవారం కుటుంబ సమేతంగా ఏడుపాయల ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం భవానీ మాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలు అందించారు. అలాగే మెదక్ జిల్లా జడ్జి లక్ష్మి శారద, మాజీ ఎమ్మెల్యే శశిధర్​రెడ్డి ఏడుపాయల సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు 
నిర్వహించారు. 

విజయానికి ప్రతీక దసరా పండుగ

మెదక్​ టౌన్: విజయానికి ప్రతీక దసరా పండుగ అని కలెక్టర్​రాహుల్​రాజ్​ అన్నారు. శనివారం దసరా పండగను పురస్కరించుకొని జిల్లా ప్రజలు, అధికారులు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో పయనించినట్లయితే విజయం వారిని తప్పకుండా వరిస్తుందని చెప్పారు.