బక్రీద్ ను ప్రశాంతంగా జరుపుకోవాలి : కలెక్టర్​ రాహుల్​రాజ్​

మెదక్​టౌన్​, వెలుగు :  జిల్లా వ్యాప్తంగా బక్రీద్​ పండగను ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం బక్రీద్ నేపథ్యంలో మెదక్​కలెక్టర్​ఆఫీసులో ఎస్పీ బాలస్వామి, ఏఎస్పీ మహేందర్​తో  కలసి అధికారులతో సమావేశాం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా మత సామరస్యానికి చిహ్నమని  ప్రతీ పండగను కుల మతాల అతీతంగా జరుపుకుంటారనీ, అదే సంస్కృతిని కొనసాగించి ప్రజలందరూ శాంతిభ్రతలను కాపాడడానికి సహకరించాలని కోరారు.  

ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో జిల్లా పశు సంవర్ధక అధికారి విజయ శేఖర్ రెడ్డి,  జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్​, తహసీల్దార్ మహేందర్ గౌడ్, పోలీస్, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.