పథకాల అమలుకు నిరంతర కృషి : కలెక్టర్ ​రాహుల్​ రాజ్​

మెదక్​టౌన్, వెలుగు : ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కలెక్టర్​ రాహుల్​రాజ్​అన్నారు. మంగళవారం ప్రజాపాలన కళాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నెల 19 నుంచి డిసెంబర్ 7- వరకు  జిల్లాలోని మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్  మున్సిపాలిటీలు, 21 మండలాల్లోని ఆయా గ్రామాల్లో పథకాలపై ప్రచారం చేస్తామని చెప్పారు. 

ఇందుకోసం  పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో ప్రత్యేకంగా ఓ వాహనాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లాలో 1.50 లక్షల కుటుంబాల సర్వే పూర్తయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఆర్​వో రామచంద్ర రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ డీఎం​సురేఖ, సాంస్కృతిక కళాకారులు పాల్గొన్నారు.

మెడికల్ ​కాలేజీలో అన్ని సౌకర్యాలు కల్పించాలి

మెదక్​ మెడికల్​ కాలేజీలో అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్​రాహుల్​ రాజ్​అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు భవనాన్ని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్​ కాలేజీ ల్యాబ్, హాస్టళ్లలోఎలక్ట్రికల్ వర్క్స్ పూర్తి చేయాలన్నారు. మరుగుదొడ్ల పనులు ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. మిషన్ భగీరథ నీరు కాలేజీకి వచ్చేలా చూడాలన్నారు. 

స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారని డిసెంబర్ నుంచి క్లాసులు ప్రారంభించాలన్నారు. ఈనెల 25 లోపు కౌన్సెలింగ్ నిర్వహించాలని సూపరింటెండెంట్​ను ఆదేశించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ కమలాదేవి ఉన్నారు.