మెదక్‌టౌన్, వెలుగు: గవర్నమెంట్హాస్పిటల్స్లో నార్మల్డెలివరీలను పెంచాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిశు సంరక్షణ కేంద్రంలో బాలింతలతో మాట్లాడారు. హాస్పిటల్లో ప్రసవాల తీరును తెలుసుకున్నారు.
పేషెంట్లకు వసతి సౌకర్యం సరిపోవడం లేదని గుర్తించి అదనపు వసతి ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. పిల్లల వార్డును పరిశీలించి డాక్టర్లతో మాట్లాడారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రవీంద్ర కుమార్, ఆర్ఎంవో కిరణ్, సిబ్బంది ఉన్నారు.
-
మెడికల్‌కాలేజీ పరిశీలన
మెదక్ పట్టణంలోని పిల్లికొట్టాల్లోని గవర్నమెంట్మెడికల్కాలేజీని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పరిశీలించారు. కాలేజీలో అవసరమైన సదుపాయాలు, డాక్టర్లు, సిబ్బంది కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిందిగా సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. 2024–--25 సంవత్సరానికి సంబంధించి ప్రణాళిక వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రవీంద్ర కుమార్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.