- కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్‌టౌన్, వెలుగు: ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్‌తెలిపారు. శనివారం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మెదక్ పట్టణంలోని బాలుర జూనియర్ కాలేజీ మైదానంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఆరు గ్యారంటీలను ప్రజలకు చేరువచేస్తున్నామన్నారు. స్టూడెంట్స్మత్తు పదార్థాలకు బానిస కాకుండా పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు నిర్మూలించేందుకు వాహనదారులకు పోలీస్ కళాజాత ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. యువత ఉన్నత చదువులు చదివి భవిష్యత్‌కు మంచి మార్గం వేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్నృత్యాలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.
గ్రామీణ అభివృద్ధి, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్నగేశ్, ఏఎస్పీ మహేందర్, మున్సిపల్ చైర్మన్చంద్రపాల్, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.