ఉప రాష్ట్రపతి పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు : కలెక్టర్​ రాహుల్​రాజ్

కౌడిపల్లి, వెలుగు: ఈ నెల 25న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్,  గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​ అధికారులను, కృషి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం మండలంలోని తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో సభా ప్రాంగణం, హెలీప్యాడ్ ను, సేంద్రియ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసే స్థలాలను ఆర్డీవో మహిపాల్ రెడ్డి, ఆర్అండ్ బీ ఈఈ సర్దార్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ సంబాజీ దత్తాత్రేయ నస్కర్, డాక్టర్ రవి కుమార్ తో కలిసి పరిశీలించారు. 

సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న పంటలు వివరాలు, రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు అతిథులను ఆకట్టుకునే విధంగా ఉండాలన్నారు.